విద్యార్థులకు, పర్యాటకులకు షాక్ ఇచ్చిన న్యూజిలాండ్

భారత్ నుండి న్యూజిలాండ్(New Zealand) వెళ్లాలనుకునే ఉద్యోగులు, పర్యాటకులు, విద్యార్థులకు ఆ దేశం షాక్ ఇచ్చింది.

Update: 2024-10-02 13:31 GMT

దిశ, వెబ్ డెస్క్ : భారత్ నుండి న్యూజిలాండ్(New Zealand) వెళ్లాలనుకునే ఉద్యోగులు, పర్యాటకులు, విద్యార్థులకు ఆ దేశం షాక్ ఇచ్చింది. అన్ని రకాల వీసా ఛార్జీలు పెంచుతున్నట్టు న్యూజిలాండ్ ప్రభుత్వం ప్రకటించింది. పెంచిన రుసుములు ఆక్రోబర్ 1 నుండి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఇప్పటివరకు విద్యార్థుల వీసా ఛార్జీలు 188 డాలర్లు ఉండగా దానిని ఏకంగా 300 డాలర్లకు పెంచింది. అలాగే పర్యాటకుల వీసా ఛార్జీలు 119 డాలర్లను 188 డాలర్లకు పెంచింది. దీంతో చదువు, ఉద్యోగం, పర్యటన నిమిత్తం వెళ్లాలనుకునే వారికి వీసా ప్రాసెసింగ్ ఛార్జీలు భారీగా పెరగనున్నాయి. కాగా వీసా ఛార్జీల పెంపుపై అక్కడి ప్రభుత్వం గత ఆగస్టులోనే ఓ ప్రకటన చేసింది. స్థానిక పన్ను చెల్లించే వారిపై పడే భారాన్ని వీసా అప్లై చేసుకునే వారి మీదికి మళ్లించడం ద్వారా సుస్థిర వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చని ఇమ్మిగ్రేషన్ మంత్రి ఎరికా స్టాన్ ఫోర్డ్ అభిప్రాయపడ్డారు.


Similar News