Nepal floods: నేపాల్ వరదలు.. 200కు చేరిన మృతుల సంఖ్య

నేపాల్‌లో వరదలు, కొండచరియలు విరిగిపడటం లాంటి ఘటనల్లో సోమవారం నాటికి 200 మంది మరణించినట్టు అధికారులు తెలిపారు.

Update: 2024-09-30 13:18 GMT

దిశ, నేషనల్ బ్యూరో: నేపాల్‌లో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో వరదలు, కొండచరియలు విరిగిపడటం లాంటి ఘటనల్లో సోమవారం నాటికి 200 మంది మరణించినట్టు అధికారులు తెలిపారు. మరో 100 మంది గల్లంతైనట్టు వెల్లడించారు. అలాగే 94 మంది గాయపడ్డట్టు పేర్కొన్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని, రెస్య్కూ చర్యలను ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని హోం మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రిషిరామ్ తివారీ పేర్కొన్నారు. ఇప్పటివరకు 4,500 మందిని విపత్తు ప్రభావిత ప్రాంతాల నుంచి రక్షించినట్టు తెలిపారు. గాయపడిన వారికి ఉచిత చికిత్స అందజేస్తుండగా, వరదల్లో చిక్కుకున్న వారికి ఇతర అత్యవసర సహాయ సామగ్రిని అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా అనేక రహదారులు తీవ్రంగా దెబ్బతినగా ప్రజా రవాణాకు తీవ్ర అంతరాయం కలిగింది. రాజధాని ఖాట్మండ్‌కు వెళ్లే దాదాపు సగానికి పైగా రహదారులను అధికారులు మూసివేశారు.


Similar News