NATO: నాటో నూతన సారథిగా మార్క్ రుట్

ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక కూటమి(Military Alliance) నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్(NATO) తదుపరి సారథిగా నెదర్లాండ్స్(Netherlands) మాజీ ప్రధాని మార్క్ రుట్(Mark Rutt) నియమితులయ్యారు.

Update: 2024-10-02 10:26 GMT

దిశ, వెబ్‌డెస్క్:ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక కూటమి(Military Alliance) నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్(NATO) తదుపరి సారథిగా నెదర్లాండ్స్(Netherlands) మాజీ ప్రధాని మార్క్ రుట్(Mark Rutt) నియమితులయ్యారు.ఈ మేరకు నాటో మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.కాగా 2014 నుండి నాటో కూటమికి నాయకత్వం వహిస్తున్న జెన్స్ స్టోల్టెన్‌బర్గ్(Jens Stoltenberg) మంగళవారం రాజీనామా చేశారు. దీంతో ఆయన స్థానంలో కొత్త చీఫ్ గా మార్క్ రుట్ పదవి బాధ్యతలు చేపట్టనున్నారు.రుట్ 14 ఏళ్ల పాటు డచ్ ప్రధానిగా పనిచేశారు.మార్క్ రుట్ కు ఉన్న అనుభవం దృష్ట్యా అతన్ని కొత్త సారథిగా ఎన్నుకున్నామని, ఆయన ఈ పదవి చేపట్టడానికి అన్ని విధాల అర్హుడని స్టోల్టెన్‌బర్గ్ ప్రశంసించారు.కాగా రష్యా(Russia) ఉక్రెయిన్(Ukrain)పై యుద్ధం(War) మొదలు పెట్టి 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో రుట్ ఈ బాధ్యతలు స్వీకరిస్తున్నారు.అమెరికా(USA) అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్(Trump), హారీస్(Harris)లలో ఎవరు గెలిచినా వారితో కలిసి సమన్వయంతో పని చేస్తానని రుట్ తెలిపారు. 


Similar News