UN Chief : ఇజ్రాయెల్‌లోకి యూఎన్ చీఫ్ ప్రవేశంపై బ్యాన్.. ఎందుకు ?

దిశ, నేషనల్ బ్యూరో : తమ దేశంపై ఇరాన్ జరిపిన దాడిని పూర్తిస్థాయిలో ఖండించనందుకు ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌పై ఇజ్రాయెల్ మండిపడింది.

Update: 2024-10-02 12:58 GMT

దిశ, నేషనల్ బ్యూరో : తమ దేశంపై ఇరాన్ జరిపిన దాడిని పూర్తిస్థాయిలో ఖండించనందుకు ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌పై ఇజ్రాయెల్ మండిపడింది. కీలకమైన స్థానంలో ఉన్నప్పటికీ పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నందుకుగానూ తమ దేశంలోకి గుటెరస్ ప్రవేశంపై బ్యాన్ విధిస్తున్నట్లు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ ప్రకటించారు. ఇరాన్ చేసిన దాడిని పూర్తిస్థాయిలో ఖండించలేని ఏ ఒక్కరికీ ఇజ్రాయెల్ గడ్డపై అడుగుపెట్టే అర్హత లేదన్నారు. ఇజ్రాయెల్‌పై ఇరాన్ చేసిన దాడి ఘటనను ఖండిస్తూ విడుదల చేసిన ప్రకటనలో ఎక్కడా ఇరాన్ పేరును ఆంటోనియో గుటెరస్‌ ప్రస్తావించలేదు.

అంతకుముందు లెబనాన్‌పై ఇజ్రాయెల్ ఆర్మీ భూతల దాడులు మొదలుపెట్టినప్పుడు విడుదల చేసిన సందేశంలో ఇందుకు భిన్నమైన స్వరాన్ని ఆయన వినిపించారు. లెబనాన్ సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడాలని గుటెరస్ ఆ మెసేజ్‌లో ప్రస్తావించారు. అతి స్వల్ప వ్యవధిలో ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ విడుదల చేసిన సందేశాల్లో భారీ వైవిధ్యం ఉండటంపై ఇజ్రాయెల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 


Similar News