Singapore President: సింగపూర్ అధ్యక్షుడిగా భారత సంతతి వ్యక్తి..

సింగపూర్ తొమ్మిదో అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన ధర్మన్ షణ్ముగరత్నం గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.

Update: 2023-09-14 14:56 GMT

సింగపూర్: సింగపూర్ తొమ్మిదో అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన ధర్మన్ షణ్ముగరత్నం గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇంతకుముందు దేశ అధ్యక్షురాలిగా వ్యవహరించిన హలీమా యాకుబ్ పదవీకాలం సెప్టెంబర్ 13తో ముగిసింది. దీంతో ఇటీవల అధ్యక్ష ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ సాధించిన 66 ఏళ్ల షణ్ముగరత్నం కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టారు. చైనా సంతతికి చెందిన అభ్యర్థులు కోక్ సాంగ్, టాన్ కిన్ లియాన్‌లను ఆయన భారీ ఓట్ల తేడాతో ఓడించారు. సెప్టెంబర్ 1న జరిగిన ఎలక్షన్ లో షణ్ముగరత్నంకు 17.46 లక్షల (70.4 శాతం) ఓట్లు వచ్చాయి. షణ్ముగరత్నం తాత 19వ శతాబ్దంలో తమిళనాడు నుంచి సింగపూర్‌కు వలస వెళ్లి సెటిల్ అయ్యారు. ప్రస్తుతం సింగపూర్‌లో తమిళ జనాభా తొమ్మిది శాతం ఉంది. ఈ ఓటర్లంతా షణ్ముగరత్నంను బలంగా సపోర్ట్ చేశారు.


Similar News