సాహిత్యంలో నోబెల్ బహుమతి ప్రకటన
ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతుల(Nobel Prizes 2024) గ్రహీతల వివరాలను స్వీడన్ లోని నోబెల్ బృందం విడుదల చేస్తోంది.
దిశవెబ్ డెస్క్ : ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతుల(Nobel Prizes 2024) గ్రహీతల వివరాలను స్వీడన్ లోని నోబెల్ బృందం విడుదల చేస్తోంది. తాజాగా గురువారం సాహిత్యంలో నోబెల్ పురస్కారాన్ని దక్షిణ కొరియాకు చెందిన రచయిత్రి హాన్ కాంగ్ కు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. సాహిత్యంలో విశేష కృషి చేసినందుకు గాను రచయిత్రి హాన్ కాంగ్ నోబెల్ 2024 బహుమతి అందుకోనుంది. కాగా గత ఏడాది నార్వేకు చెందిన రచయిత జాన్ ఫోసే ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
స్వీడన్ కు చెందిన శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా వివిధ రంగాలలో చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా నోబెల్ పురస్కారాలను ప్రకటిస్తారు. ఈ బహుమతులను నోబెల్ వర్ధంతి రోజైన డిసెంబర్ 10న గ్రహితలకు అందజేస్తారు. కాగా సోమ, మంగళ, బుధ వారాల్లో వైద్య, భౌతిక, రసాయన శాస్త్ర రంగాలకు పురస్కార గ్రహితలను ప్రకటించగా.. నేడు సాహిత్య విభాగానికి, శుక్రవారం శాంతి బహుమతిని ప్రకటించనున్నారు. అక్టోబర్ 14న అర్థశాస్త్రంలో పురస్కార గ్రహితల పేర్లను ప్రకటిస్తారు.