మరణశిక్షల్లో ప్రపంచంలో పాక్ టాప్ ప్లేస్
ప్రపంచంలో అత్యధిక మరణశిక్షలు విధించే దేశాల్లో పాకిస్థాన్ మొదటి స్థానంలో నిలిచింది.
దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచంలో అత్యధిక మరణశిక్షలు విధించే దేశాల్లో పాకిస్థాన్ మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా మరణశిక్షలు ఎదుర్కొంటున్న వారిలో 26% మంది పాక్ కు చెందిన వారేనని 'జస్టిస్ ప్రాజెక్ట్ పాకిస్థాన్' అనే స్వచ్చంద న్యాయసేవల సంస్థ వివరాలు వెల్లడించింది. 2024 నాటికి పాక్ లో దాదాపు 6100 మంది మరణశిక్షను ఎదుర్కొన్నారని పేర్కొంది. వారిలో ఈ ఏడాది ఇప్పటి వరకు 4500 మందికి న్యాయస్థానాలు మరణశిక్ష విధించాయని తెలిపింది. కనీసం రోజుకు ఒకరి చొప్పున అయినా ఈ శిక్షను ఎదుర్కొంటున్నారని న్యాయసంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఎక్కువ పంజాబ్ ప్రావిన్స్ కు చెందిన వారే ఈ శిక్షను ఎదుర్కొంటున్నట్టుగా, ఆ తర్వాత ఖైబర్ పఖ్తనకా ప్రాంతానికి చెందిన వారు ఎదుర్కొనటున్నట్టు తన నివేదికలో పేర్కొంది.