Mossad: ఇంటెలిజెన్స్ అధిపతే మమ్మల్ని మోసం చేశాడు.. ఇరాన్ మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహ్మద్ అహ్మదిన్ జాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ పై నిఘా కోసం ఏర్పాటు చేసిన ఇంటెలిజెన్స్ అధిపతే తమని మోసం చేసినట్లు వెల్లడించారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహ్మద్ అహ్మదిన్ జాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ పై నిఘా కోసం ఏర్పాటు చేసిన ఇంటెలిజెన్స్ అధిపతే తమని మోసం చేసినట్లు వెల్లడించారు. టెహ్రాన్ లో మొస్సాద్ సంస్థ ఏం చేసిందో అనే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మొస్సాద్ విజయవంతంగా మా ఇంటెలిజెన్స్ యూనిట్స్‌ను తన వైపునకు తిప్పుకొందన్నారు. వీరిలో సీనియర్ అధికారులు కూడా ఉన్నట్లు చెప్పారు. దాదాపు 20 మంది ఇంటెలిజెన్స్ సిబ్బంది డబుల్ ఏజెంట్లుగా మారిపోయారని ఆరోపించారు. ఇజ్రాయెల్‌కు అత్యంత కీలకమైన అణు రహస్యాలను చేరవేశారన్నారు.
ఇరాన్ భద్రత, నిఘా వ్యవస్థలు
కాగా.. ఇరాన్ మాజీ అధ్యక్షుడి వ్యాఖ్యలతో ఇరాన్ భద్రత, నిఘా వ్యవస్థలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తమ నిఘా సంస్థకు చెందిన అధిపతి ఒకరు ఇజ్రాయెల్ గూఢచారని 2021లో బయటపడిందన్నారు. ఇరాన్‌లో టెల్‌అవీవ్ అత్యంత కఠిన ఆపరేషన్లు నిర్వహించిందన్నారు. సునాయాసంగా కీలక సమాచారం చేజిక్కించుకుందన్నారు. ఇటీవల కాలంలో మొస్సాద్ కార్యకలాపాలు మరింత పెరిగిపోయాయని అన్నారు. మరోవైపు, మొస్సాద్ ఓ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టి లక్ష అణు రహస్య పత్రాలు అపహరించింది. వాటిని ఇజ్రాయెల్ ప్రధాని 2018లో బయటపెట్టారు. ఇరాన్ సీక్రెట్ న్యూక్లియర్ ప్రయోగాలు చేస్తుందో అందులో స్పష్టంగా ఉంది. అయితే, టెహ్రాన్ రహస్య స్థావరంలోకి వెళ్లి మొస్సాద్ ఏజెంట్లు వాటిని చేజిక్కించుకున్నారు. దీంతో ఇరాన్ న్యూక్లియర్ యాక్టివిటీలు దెబ్బతిన్నాయి.