Hassan Nasrallah: హసన్ నస్రల్లా హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం: రష్యా
లెబనాన్(Lebanon) రాజధాని దక్షిణ బీరుట్(South Beirut)లోని హెజ్‌బొల్లా(Hezbollah) స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్(Israel) గత కొన్ని రోజులుగా వైమానిక దాడులు(Air Strikes) చేస్తోంది.
దిశ, వెబ్‌డెస్క్:లెబనాన్(Lebanon) రాజధాని దక్షిణ బీరుట్(South Beirut)లోని హెజ్‌బొల్లా(Hezbollah) స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్(Israel) గత కొన్ని రోజులుగా వైమానిక దాడులు(Air Strikes) చేస్తోంది.కాగా ఈ దాడుల్లో హిజ్‌బొల్లా అధినేత హసన్ నస్రల్లా (Hassan Nasrallah) హతమైన విషయం తెలిసిందే.గురువారం జరిపిన వైమానిక దాడిలో నస్రల్లా మరణించినట్లు ఇజ్రాయెల్ సైన్యం శనివారం అధికారంగా ప్రకటించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ డిఫెన్సె ఫోర్సెస్(IDF) తమ 'X'లో ప్రకటించింది.అయితే ఈ దాడుల్లో నస్రల్లా కుమార్తె జైనబ్ కూడా మృతి చెందినట్లు సమాచారం.దీంతో వీరి మరణ వార్త లెబనాన్ దేశాన్ని కుదిపేస్తోంది.ఇదిలా ఉంటే..నస్రల్లాను ఇజ్రాయెల్ హత్య చేయడాన్ని రష్యా(Russia) తీవ్రంగా ఖండిస్తున్నట్లు(Condemns) విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది.ఇది మరో రాజకీయ హత్యగా రష్యా పేర్కొంది. ఈ చర్య లెబనాన్ సహా పశ్చిమాసియా దేశాలలో పరిస్థితుల్ని మరింత ఉద్రిక్తంగా మారుస్తుందని హెచ్చరించింది. లెబనాన్‌పై దాడులను ఆపాలని కోరింది.