Gun Fire: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఆరుగురికి తీవ్ర గాయాలు..!

అమెరికాలోని టేనస్సీ రాష్ట్రంలో కాల్పులు కలకలం రేపాయి.

Update: 2024-09-02 22:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలోని టేనస్సీ రాష్ట్రంలో కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటనలో ఆరుగురుకి గాయాలు అయినట్లు సమాచారం. నాష్‌విల్లే మెట్రో పోలీస్ డిపార్ట్‌మెంట్ తెలిపిన వివరాల ప్రకారం..దక్షిణ నాష్‌విల్లేలోని ఆంటియోచ్‌లో సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ కాల్పులు ఘటన చోటు చేసుకుంది. సోమవారం అర్థరాత్రి రెండు షూటింగ్‌ ఘటనలు జరిగినట్లు తెలిపారు.మొదటిది ఆంటియోచ్‌లోని స్కైబార్ & లాంజ్‌ పార్కింగ్ స్థలంలో జరగగా, రెండవ ఘటన దక్షిణ నాష్‌విల్లేలోని బ్రూక్‌వ్యూ ఎస్టేట్స్ సమీపంలో చోటు చేసుకుందని నాష్‌విల్లే పోలీసులు తెలిపారు. ఈ రెండు కాల్పుల ఘటనలు పది నిమిషాల వ్యవధిలోనే జరిగాయి. కాగా గాయపడ్డ వారిని అంబులెన్స్ లో సమీపంలోని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని,బాధితులందరూ ప్రాణాలతో బయటపడినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా కాల్పులు జరిపిన నిందితులను పట్టుకోవడానికి CCTV ఫుటేజీని పరిశీలుస్తున్నామని, వారిని త్వరలోనే పట్టుకొని విచారిస్తామని నాష్‌విల్లే మెట్రో పోలీసులు తెలిపారు.    


Similar News