Israeli Bombings : ఇజ్రాయెల్ దాడుల భయం.. సిరియాకు లక్ష మందికిపైగా లెబనీస్ వలస

దిశ, నేషనల్ బ్యూరో : ఓ వైపు లెబనాన్‌పై ఇజ్రాయెల్ ఆర్మీ భీకర వైమానిక దాడులు చేస్తుండగా.. మరోవైపు సిరియాలో అమెరికా ఆర్మీ సైతం ఎటాక్స్ మొదలుపెట్టింది.

Update: 2024-09-29 14:33 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఓ వైపు లెబనాన్‌పై ఇజ్రాయెల్ ఆర్మీ భీకర వైమానిక దాడులు చేస్తుండగా.. మరోవైపు సిరియాలో అమెరికా ఆర్మీ సైతం ఎటాక్స్ మొదలుపెట్టింది. ఈ తరుణంలో పక్కపక్కనే ఉండే ఈ రెండు దేశాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు. అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని వారు కాలం వెళ్లదీస్తున్నారు. ఇజ్రాయెల్ వైమానిక దాడులు మొదలైనప్పటి నుంచి దాదాపు లక్ష మందికిపైగా లెబనాన్ ప్రజలు సరిహద్దు దాటి సిరియాకు వలస వెళ్లిపోయారు.

ప్రాణాలను కాపాడుకోవాలనే ఏకైక లక్ష్యంతో ఇళ్లు, భూములు, స్థిరాస్తులను వదిలేసి లెబనాన్ ప్రజలు వలస వెళ్తున్నారు. యుద్ధ వాతావరణం చల్లారిన తర్వాతే వారంతా స్వదేశానికి తిరిగొచ్చే అవకాశం ఉంది. మరోవైపు సిరియా నుంచి కూడా శరణార్ధులు లెబనాన్‌లోకి ప్రవేశిస్తున్నారు. అయితే సిరియా నుంచి తమ దేశంలోకి వస్తున్న వారిలో ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మోసాద్ ఏజెంట్లు కూడా ఉండొచ్చని హిజ్బుల్లా వర్గాలు అనుమానిస్తున్నాయి.


Similar News