Emirates Airlines: పేజర్లు,వాకీటాకీలపై నిషేధం విధిస్తూ ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌ నిర్ణయం

దుబాయ్‌(Dubai)కి చెందిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్(Emirates Airlines) కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2024-10-06 03:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: దుబాయ్‌(Dubai)కి చెందిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్(Emirates Airlines) కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియా దేశాల(West Asian Countries)లో రోజురోజుకి ఉద్రిక్తత పరిస్థితులు పెరుగుతున్న నేపథ్యంలో తన విమానాలలో పేజర్లు(Pagers), వాకీ-టాకీల(walkie-talkies)ను తీసుకెళ్లడాన్ని నిషేధించింది.ఈ మేరకు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.ఈ నిబంధనలు అంతర్జాతీయ ప్రయాణికులందరికీ(All International Travelers) వర్తిస్తాయని పేర్కొంది. కాగా శుక్రవారం దుబాయ్ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల చెక్ ఇన్ బ్యాగ్(Check in bag)లో పేజర్లు దొరికాయి. దీంతో ఎయిర్ పోర్ట్ అధికారులు వాటిని జప్తు చేశారు.

ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇరాక్(Iraq), ఇరాన్‌(Iran)లకు మంగళవారం వరకు విమానాలు నిలిపివేయబడతాయని తెలిపింది. జోర్డాన్‌(Jordan)కు ఆదివారం తిరిగి సేవలు ప్రారంభమవుతాయని ప్రకటించింది.ఇక ఇజ్రాయిల్(Israel) లెబనాన్(Lebanon)పై వైమానిక దాడులు తీవ్రతరం చేసిన కారణంగా లెబనాన్ దేశానికి విమాన సర్వీసులు నిలిపివేసింది.ఇకనుంచి ప్రయాణికుల ప్రతీ బ్యాగ్ ను క్షుణ్ణంగా పరిశీలించాకే ప్రయాణానికి అనుమతిస్తామని ఎమిరేట్స్ సంస్థ వెల్లడించింది.కాగా గత నెలలో లెబనాన్‌లో హెజ్బొల్లా లక్ష్యంగా జరిగిన పేజర్లు, వాకీటాకీల పేలుళ్ల ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.ఈ ఘటనలో వందలాది మంది చనిపోగా, వేలాది మంది గాయపడ్డారు.దీంతో విమానాల్లో పేజర్లు, వాకీటాకీలపై ఎమిరేట్స్ సంస్థ నిషేధం విధించినట్లు తెలుస్తోంది.


Similar News