వైట్ హౌస్ కు మైలు దూరంలోనే ఉన్నా.. కమలా హారిస్‌ను ఒక్కసారి కూడా చూడడానికి రాని తండ్రి.. ఎందుకంటే..?

అగ్ర రాజ్యం అమెరికాలో నవంబర్ నెలలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

Update: 2024-09-01 00:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: అగ్ర రాజ్యం అమెరికాలో నవంబర్ నెలలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ ప్రచారం ఊపందుకుంది. డెమోక్రాటిక్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న కమలాహారిస్‌ తన ప్రచారంలో దూసుకుపోతున్నారు. తన ప్రత్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌కు పోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కమలా హారిస్‌ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు ప్రస్తుతం చర్యనీయాంశంగా మారాయి. కమలా హారిస్‌ తండ్రి డోనాల్డ్‌ హారిస్‌ వైట్‌ హౌజ్‌కు కేవలం కూతవేటు దూరంలో ఉన్నా కమలా హారిస్‌ను ఒక్కసారి కూడా చూడడానికి రాలేదు. దీంతో తండ్రీకుమార్తెల మధ్య దూరం పెరిగిపోయినట్లు సమాచారం.ఈ నేపథ్యంలో అసలు కమలా హారిస్‌ యొక్క కుటుంబ నేపథ్యం ఇప్పుడు తెలుసుకుందాం..

కమలా హారిస్‌ తండ్రి డొనాల్డ్‌ హారిస్‌.. 1938లో జమైకాలోని బ్రౌన్స్‌ పట్టణంలో జన్మించారు. పీహెచ్‌డీ చదవడం కోసం అమెరికాలోని కాలిఫోర్నియాకు వలస వచ్చాడు. ఈ క్రమంలోనే అదే కాలేజీలో చదువుతున్న కమలా హారిస్ తల్లి శ్యామలా గోపాలన్‌, డొనాల్డ్‌ హారిస్‌ కు పరిచయం అయ్యారు.దీంతో వీరిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇదిలా ఉంటె కొన్ని సంవత్సరాల అనంతరం వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఈ జంటకు కమలా, మాయా ఇద్దరు కుమార్తెలు జన్మించారు.కమలా హారిస్‌కు ఏడేళ్ల వయసున్న సమయంలో శ్యామల, తండ్రి హారిస్‌ల మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. దీంతో ఇద్దరి మధ్య విబేధాలు ఏర్పడి విడిపోయారు.ఆ తరువాత శ్యామల కెనడాలోని ఇల్లినాయిస్‌ పట్టణానికి వలస వెళ్ళింది.దీంతో కమలా కూడా తల్లి వద్దే పెరిగింది. ఆ తర్వాత నుంచి ఇరువురి మధ్య పెద్దగా సంబంధాలు లేకుండాపోయాయి. అప్పటి నుంచి తండ్రి, కూతుళ్ల మధ్య బంధం దూరమవుతూ వచ్చింది. అమెరికా ఉపాధ్యక్షురాలిగా గెలిచి తొలి మహిళగా చరిత్ర సృష్టించినా ఆమె తండ్రి ఒక్కసారి కూడా స్పందించలేదు.కాగా కమలా హారిస్‌ ఉపాధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారానికి కూడా డొనాల్డ్‌ హాజరు కాకపోవడం గమనార్హం.అయితే ప్రత్యర్థులు మాత్రం కమలా తండ్రిలోని కమ్యూనిస్ట్‌ భావాలను పుణికిపుచ్చుకుందని పలు సార్లు ఆరోపించారు. ట్రంప్‌ కూడా ఇదే ఆరోపణను చేస్తూ వచ్చారు. అయితే ఒక్కసారి కూడా డొనాల్డ్‌ హారిస్‌ ఈ వార్తలపై స్పందించలేదు.దీంతో ఇప్పుడీ అంశం చర్యనీయాంశంగా మారింది. మరి కమలా హారిస్‌ అమెరికా అధ్యక్షురాలిగా ఎన్నికైనా తర్వాత అయినా డొనాల్డ్ తన కూతురు గురించి మాట్లాడుతారో లేదో చూడాలి. ఇదిలా ఉంటే.. కమలా హారిస్‌ తల్లి శ్యామలా గోపాలన్‌ 2009 సంవత్సరంలో పెద్దపేగు క్యాన్సర్‌తో మరణించారు.


Similar News