Barack Obama: కమలా హారిస్‌కు మద్దత్తుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న యుఎస్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా..!
అగ్రరాజ్యం అమెరికా(USA)లో ఈ ఏడాది నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికలు(Presidential Elections) జరగనున్న విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్:అగ్రరాజ్యం అమెరికా(USA)లో ఈ ఏడాది నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికలు(Presidential Elections) జరగనున్న విషయం తెలిసిందే.ఈ ఎన్నికల్లో రిపబ్లికన్(Republican) పార్టీ తరుపున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) బరిలోకి దిగుతుండగా,డెమోక్రటిక్(Democratic) పార్టీ నుంచి ప్రస్తుత ఉపాధ్యక్షురాలు,భారత సంతతి మహిళ కమలా హారిస్(Kamala Harris) పోటీలో ఉన్నారు.ఇక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఇరువురు అభ్యర్థులు తమ ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఇదిలా ఉండగా.. కమలా హారిస్‌కు మద్దతుగా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా(Barack Obama) ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. స్వింగ్ స్టేట్స్(Swing States)లోని ఓటర్లే లక్ష్యంగా ఈ నెల 10న పెన్సిల్వేనియా(Pennsylvania)లోని పిట్స్‌బర్గ్(Pittsburgh)లో ఒబామా తొలి ఎన్నికల ప్రచార సభ జరగనున్నట్టు తెలుస్తోంది. అయితే..ఈ సభలో కమల కూడా పాల్గొనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది.కాగా అధ్యక్ష ఎన్నికల బరిలోనుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకోవడంతో డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారీస్ ను డెమొక్రాట్లు(Democrats) ఎన్నుకున్నారు.హారీస్ అభ్యర్థిత్వ నామినేషన్‌కు ఒబామా,ఆయన సతీమణి మిచెల్ మద్దతు పలికిన విషయం తెలిసిందే. స్వయంగా కమలా హారిస్‌కు ఫోన్ చేసి తమ మద్దతును తెలిపారు.అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు కమలా హారిస్‌కు మద్దతు ఇచ్చే విషయంలో తామిద్దరం ఎంతో గర్వపడుతున్నామని బరాక్ ఒబామా దంపతులు వెల్లడించారు.