Eastern Libya: లిబియాలో జలప్రళయం.. 2000 మంది మృతి

తూర్పు లిబియాను వరదలు ముంచెత్తడంతో 2,000 మంది చనిపోయారు.

Update: 2023-09-12 14:49 GMT

లిబియా: తూర్పు లిబియాను వరదలు ముంచెత్తడంతో 2,000 మంది చనిపోయారు. అంతేకాదు మరో 10,000 మంది తప్పిపోయినట్లు రెడ్ క్రాస్ అంచనా వేస్తోంది. డేనియల్ తుఫాన్ కారణంగా సంభవించిన వరదలతో లిబియాలో ఇప్పటికే రెండు డ్యామ్‌లు తెగిపోయాయి. డెర్నా నగరంతో పాటు ముంపు ప్రాంతాలు నీట మునిగాయి. అత్యంత ఘోర వినాశనాన్ని చూసిన డెర్నా నగరంలో దాదాపు 6,000 మంది తప్పిపోయారని లిబియా తూర్పు ప్రభుత్వ ఆరోగ్య మంత్రి ఒత్మాన్ అబ్దుల్‌జలీల్ వెల్లడించారు.

సోమవారం డెర్నాలో పర్యటించిన జలీల్.. బీతావాహ పరిస్థితులు తలెత్తాయని తెలిపారు. మృతదేహాలు ఇప్పటికీ చాలా చోట్ల పడి ఉన్నాయన్నారు. వాస్తవ సంఖ్య ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండొచ్చని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రెసెంట్ సొసైటీలకు చెందిన టామర్ రంజాన్ తెలిపారు. ప్రస్తుతం అక్కడ మానవతా అవసరాలు.. లిబియా రెడ్ క్రెసెంట్ సామర్థ్యాలతో పాటు ప్రభుత్వ సామర్థ్యాల కంటే మించి ఉన్నాయని రంజాన్ చెప్పారు.


Similar News