సాగర్ కాల్వలో గల్లంతైన కూలీలు.. ఆ పని చేస్తుండగానే పడిపోయారు

దిశ, నేరేడుచర్ల : బతుకు దెరువు కోసం బీహార్ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రం వచ్చి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఇద్దరు బీహార్ కూలీలు నాగార్జునసాగర్ ఎడమ కాల్వనీటిలో పడి గల్లంతైనారు. నేరేడుచర్ల ఎస్ఐ విజయ్ ప్రకాష్ ట్రైనింగ్ ఎస్ఐ అభిలాష్ తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల మండలంలోని కల్లూర్ గ్రామ శివారులోని శ్రీ లక్ష్మి సహస్ర రైస్ మిల్లులో బీహార్ రాష్ట్రానికి చెందిన సునీల్ ఎంబ్రం (31) వినోద్ ముకియా(47) కొంతమంది బీహార్ […]

Update: 2021-10-05 23:35 GMT

దిశ, నేరేడుచర్ల : బతుకు దెరువు కోసం బీహార్ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రం వచ్చి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఇద్దరు బీహార్ కూలీలు నాగార్జునసాగర్ ఎడమ కాల్వనీటిలో పడి గల్లంతైనారు. నేరేడుచర్ల ఎస్ఐ విజయ్ ప్రకాష్ ట్రైనింగ్ ఎస్ఐ అభిలాష్ తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల మండలంలోని కల్లూర్ గ్రామ శివారులోని శ్రీ లక్ష్మి సహస్ర రైస్ మిల్లులో బీహార్ రాష్ట్రానికి చెందిన సునీల్ ఎంబ్రం (31) వినోద్ ముకియా(47) కొంతమంది బీహార్ వ్యక్తులతో కలిసి వచ్చి ఇక్కడ కూలి పనులు చేసుకుంటున్నారు. మంగళవారం మధ్యాహ్నం సమయం బట్టలు ఉతికేందుకు ముకుందాపురం గ్రామ శివారులోని సాగర్ ఎడమకాలువకు వెళ్లి బట్టలు ఉతుకుతుండగా కాలుజారి నీటిలో పడి గల్లంతు అయినట్లు తెలిపారు. గల్లంతైన వారి కోసం నీటిలో ఎంత వెతికిన దొరకకపోవడంతో వీరితో పాటు అక్కడే కూలి పనులు చేసుకుంటున్న మహేష్ కిస్కి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. వీరి ఆచూకి తెలిసిన వారు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు .

Tags:    

Similar News