ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన మరో లారీ..
లారీని వెనుక నుంచి మరో లారీ ఢీ కొట్టిన ఘటన కోదాడ మండల
దిశ, కోదాడ : లారీని వెనుక నుంచి మరో లారీ ఢీ కొట్టిన ఘటన కోదాడ మండల పరిధిలోని ద్వారకుంట గ్రామ శివారులో 65 నెంబర్ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని ద్వారకుంట గ్రామ శివారులో జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీ రిపేర్ వచ్చి ఆగి ఉంది. వెనక నుండి మరో లారీ ఢీ కొట్టడంతో షార్ట్ సర్క్యూట్ అయి లారీ మొత్తం దగ్గమైంది. బియ్యంలోడు లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బియ్యం లోడు లారీ బోల్తా పడింది లారీలో ఉన్న బియ్యం బస్తాలు మొత్తం కింద పడిపోయాయి.
ప్రమాదానికి కారణమైన లారీ లో షార్ట్ సర్క్యూట్ జరిగి లారీ క్యాబిన్ తగలబడింది.ఈ ఘటన లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. రాత్రిపూట కావడంతో లారీలో మంటలు చెలరేగడంతో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. బియ్యం లోడ్ ను రెవెన్యూ అధికారులు పరిశీలించారు రేషన్ బియ్యానికి సంబంధించినది అసలు రేషన్ బియ్యం కాదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు. సదరు బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు శాంపిల్ తీసుకువెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు స్థానికులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. లారీ డ్రైవర్ సూరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై అనిల్ రెడ్డి తెలిపారు.