యాదాద్రిలో భారీగా డ్రగ్స్ తయారీ పదార్థాలు పట్టివేత..

యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ ఎత్తున డ్రగ్స్ తయారు చేస్తూ

Update: 2024-11-26 14:19 GMT

దిశ,యాదాద్రి కలెక్టరేట్ : యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ ఎత్తున డ్రగ్స్ తయారు చేస్తూ తరలిస్తున్న ముఠాను తెలంగాణ నార్కోటిక్ బ్యూరో, రాచకొండ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో ముఠా గుట్టు రట్టు చేశారు. 24 కోట్ల విలువ చేసే 120 కేజీల నిషేధిత ఎఫిడ్రిన్, మెఫిడ్రోన్ సింథటిక్ డ్రాగ్ తరలిస్తున్న వ్యక్తులను గూడూరు టోల్ ప్లాజా వద్ద అదుపులోకి తీసుకున్నట్లు భువనగిరి జోన్ డీసీపీ రాజేష్ చంద్ర మంగళవారం మీడియా సమావేశంలో తెలిపారు. యాదగిరిగుట్ట మండలం రామాజీపేట్ శివార్లలో మూసివేసిన యాదాద్రి లైఫ్ సైన్స్ కెమికల్ పరిశ్రమ అడ్డాగా చేసుకొని డ్రగ్స్ తయారు చేసి ముంబైకి తరలిస్తున్నట్లు డీసీపీ తెలిపారు.

నేతి కృష్ణ రెడ్డి, ఫైజాన్ అహ్మద్ (ముంబై), చెపురి సునీల్ (డైవర్) ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వాసుదేవ్ చారి,భాను ప్రసాద్, సల్మాన్ షేక్ డోల (ముంబై), సత్యనారాయణ (కెమిస్ట్రీ) ఐదుగురు పరారీలో ఉన్నారని పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని మీడియా సమావేశంలో డిసిపి వెల్లడించారు. సోమవారం సాయంత్రం నుంచి యాదాద్రి లైఫ్ సైన్సెస్ పరిశ్రమలో విస్తృతంగా తనిఖీలు చేశారు.


Similar News