డ్రగ్స్ మహమ్మారి జోలికి పోవద్దు : సీఐ రాజశేఖర్ రెడ్డి
ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని, దానిని సాధించేందుకు కృషి
దిశ, నల్గొండ క్రైమ్: ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని, దానిని సాధించేందుకు కృషి చేయాలని, డ్రగ్స్ మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి నల్లగొండ వన్ టౌన్ సీఐ ఏమి రెడ్డి రాజశేఖర్ రెడ్డి సూచించారు. మిషన్ పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అలాగే సైబర్ నేరాలపై అవగాహన ఉండాలని, వారి ఉచ్చులో పడొద్దని సూచించారు. బ్యాంక్ ఖాతా, ఏటీఎం పిన్ నెంబర్లు, ఓటీపీ వివరాలు ఇతరులకు చెప్పొద్దని అన్నారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే టోల్‌ఫ్రీ నెంబర్ 1930కు కాల్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శోభన్ ఏఎస్ఐ వెంకటయ్య, పోలీస్ సిబ్బంది మధుసూదన్ రెడ్డి, ఇర్ఫాన్, శ్రీను ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.