ప్రభుత్వం భరోసా గా నిలుస్తుంది : ఎమ్మెల్యే మందుల సామేల్

నూతనకల్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన 16 మంది లబ్ధిదారులకు

Update: 2024-11-26 12:34 GMT

దిశ,నూతనకల్: నూతనకల్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన 16 మంది లబ్ధిదారులకు మంజూరైన సుమారు 7 లక్షల 30 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే మందుల సామేల్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పేదరికంతో బాధపడుతూ అనారోగ్యాల బారిన పడుతున్న వారికి వైద్య ఖర్చుల నిమిత్తం, ఆర్థిక సాయం అందించడం ద్వారా ప్రభుత్వం భరోసాగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగం సుధాకర్ రెడ్డి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ బొల్క సైదులు యాదవ్, బద్రి, పాల్వాయి నాగరాజు, కృష్ణ ప్రశాంత్, గణేష్, సాయి, తదితర లబ్ధిదారులు ఉన్నారు.


Similar News