కత్తితో దాడి.. పోలీస్ స్టేషన్ ఎదుట హత్యాయత్నం
పోలీస్ స్టేషన్ ఎదుటనే వ్యక్తిపై కత్తితో దాడి చేసిన ఘటన
దిశ, తిరుమలగిరి (సాగర్): పోలీస్ స్టేషన్ ఎదుటనే వ్యక్తిపై కత్తితో దాడి చేసిన ఘటన తిరుమలగిరి (సాగర్) మండల పోలీస్ స్టేషన్ లో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) పోలీస్ స్టేషన్ ఎదుట సపావట్ ముని అనే వ్యక్తి పై సపావట్ మోహన్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు.రెండు చోట్ల ముని శరీరంపై మోహన్ పొడిచాడు.స్టేషన్ లోనే హత్యాయత్నం జరగడంతో పోలీసులు నివ్వెరపోయారు. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం నల్గొండ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. దాడికి పాల్పడ్డ మోహన్ ని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. కిచ్య తండా గ్రామానికి చెందిన మోహన్ తన భార్యతో మాట్లాడుతున్నాడనే అనే అనుమానంతో నాలుగు రోజుల క్రితం పోలీస్ స్టేషన్ లో ముని పై మోహన్ ఫిర్యాదు చేశాడు. పోలీస్ స్టేషన్ ఆవరణలో పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడుతుండగా ఘటన జరిగింది. స్టేషన్ పక్కకు రాగానే ప్లాన్ ప్రకారం మోహన్ తన వెంట తెచ్చుకున్న కత్తితో ముని పై దాడి చేసినట్లు తెలుస్తుంది.