తీవ్ర విషాదం.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య..

కుటుంబ కలహాలతో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య

Update: 2024-11-26 12:51 GMT

దిశ, వనపర్తి : కుటుంబ కలహాలతో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రం లో వెలుగులోకి వచ్చింది. టౌన్ ఎస్ఐ హరి ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం వనపర్తి జిల్లా కేంద్రంలోని గణేష్ నగర్ కు చెందిన నిరంజన్, నసీఫా బేగం (35) భార్యాభర్తలు. వీరికి హబీబ్ (7), సనా బేగం (5) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొంతకాలంగా భార్యాభర్తలు తరచుగా గొడవ పడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మరో మారు భార్య భర్తల మధ్య గొడవ జరగడంతో నసీఫా బేగం సోమవారం సాయంత్రం నుంచి కనిపించకుండగా పోయింది.

రాత్రి సమయములో తన పిల్లలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు వారి బంధువులు, ఆచూకీ కోసం ప్రయత్నాలు చేయగా. మంగళవారం మధ్యాహ్నం తర్వాత మూడు మృతదేహాలు తాళ్ల చెరువులో తేలియాడుతూ ఉన్న విషయాన్ని కొంతమంది గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు నసిఫా బేగం కుటుంబ సభ్యులు సంఘటన స్థలం వద్దకు చేరి మృతదేహాలను గుర్తించారు. ఈ మేరకు పూర్తిస్థాయిలో పోలీసులు విచారణ జరుపుకున్నారు.


Similar News