MLA రసమయి ముందే మహిళా సర్పంచుల విశ్వరూపం..
దిశ, మానకొండూర్ : కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ మండల వైద్యాధికారి తీరుపై మహిళా సర్పంచులు భగ్గుమన్నారు. మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఎదుటే వైద్యాధికారిని కడిగి పారేశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో శనివారం వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. తిమ్మాపూర్ మండల కేంద్రంలోని పలుగ్రామాల్లో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నా మండల వైద్యాధికారి పట్టించుకున్న పాపాన పోలేదని వచ్చునూర్ సర్పంచ్ ఉమారాణి, మన్నెంపల్లి సర్పంచ్ […]
దిశ, మానకొండూర్ : కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ మండల వైద్యాధికారి తీరుపై మహిళా సర్పంచులు భగ్గుమన్నారు. మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఎదుటే వైద్యాధికారిని కడిగి పారేశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో శనివారం వెలుగుచూసింది.
వివరాల్లోకివెళితే.. తిమ్మాపూర్ మండల కేంద్రంలోని పలుగ్రామాల్లో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నా మండల వైద్యాధికారి పట్టించుకున్న పాపాన పోలేదని వచ్చునూర్ సర్పంచ్ ఉమారాణి, మన్నెంపల్లి సర్పంచ్ మేడి అంజయ్య, ఇతర మహిళా సర్పంచులు స్థానిక ఎమ్మెల్యే రసమయికి ఫిర్యాదు చేశారు.
ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా కనీసం అందుబాటులో లేరని తమ విశ్వరూపం చూపించారు. ఇప్పటివరకు కొవిడ్ నివారణ టీకాలు ఇవ్వలేదని పలుగ్రామాల సర్పంచులు మండిపడ్డారు. ఈ విషయమై డాక్టర్‌కు ఫోన్ చేస్తే పొంతన లేని సమాధానం చెప్పడంతో పాటు ఫోన్ కట్ చేస్తున్నారని సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే ముందే డాక్టర్ ఇందును నిలదీశారు ప్రజాప్రతినిధులు.
మధ్యలో కలుగజేసుకున్న ఎమ్మెల్యే రసమయి పక్కనే ఉన్న డాక్టర్‌తో మాట్లాడారు. ఇక నుండి మండల ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆ తర్వాత పలు గ్రామాల సర్పంచ్‌లకు సర్దిచెప్పారు. ఇకమీదట ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా డాక్టర్ అందుబాటులో ఉంటుందని ఆయన సర్పంచులకు హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.