గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్.. మహిళా మావోయిస్టు మృతి

దిశ, కరీంనగర్: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ మహిళా మావోయిస్టు మృతిచెందారు. మృతిచెందిన మావోయిస్టును సృజనక్కగా గుర్తించారు. గడ్చిరోలి ఎస్పీ శైలేష్ బల్కావుడే వివరాల ప్రకారం జిల్లాలోని ఏటాపల్లి తాలుకా జారవండి పోలీస్‌స్టేషన్ పరిధిలో సిన్‌బట్టి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశం అయ్యారనే సమాచారంతో సీ60 కమాండోలు కూంబింగ్ చేపట్టారు. సమావేశం సమీపంలోకి చేరుకోగానే మావోయిస్టులు కాల్పులకు తెగపడడంతో కమాండోలు ఎదురు కాల్పులకు దిగారు. ఈ ఎన్‌కౌంటర్‌లో కసన్‌సూర్ దళం డివిజనల్ కమాండర్, మహిళా […]

Update: 2020-05-02 10:29 GMT

దిశ, కరీంనగర్: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ మహిళా మావోయిస్టు మృతిచెందారు. మృతిచెందిన మావోయిస్టును సృజనక్కగా గుర్తించారు. గడ్చిరోలి ఎస్పీ శైలేష్ బల్కావుడే వివరాల ప్రకారం జిల్లాలోని ఏటాపల్లి తాలుకా జారవండి పోలీస్‌స్టేషన్ పరిధిలో సిన్‌బట్టి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశం అయ్యారనే సమాచారంతో సీ60 కమాండోలు కూంబింగ్ చేపట్టారు. సమావేశం సమీపంలోకి చేరుకోగానే మావోయిస్టులు కాల్పులకు తెగపడడంతో కమాండోలు ఎదురు కాల్పులకు దిగారు. ఈ ఎన్‌కౌంటర్‌లో కసన్‌సూర్ దళం డివిజనల్ కమాండర్, మహిళా మావోయిస్టు సృజనక్క అలియాస్ చిన్నక్క అలియాస్ చైతు ఆర్కా(48) మృతిచెందారు. సృజనక్కపై రూ. 16 లక్షల రివార్డు ఉందని గడ్చిరోలి జిల్లా పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలంలో ఏకే 47, క్లైమోర్‌మైన్, విప్లవ సాహిత్యం, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా కూంబింగ్ కొనసాగుతోందని తెలిపారు.

Tags: Encounter,Women Maoist,sp shailesh,Gadchiroli

Tags:    

Similar News