ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకం.. వైద్యం వికటించి బాలింత మృతి

దిశ, జగిత్యాల : జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలం కమ్మునూర్ గ్రామానికి చెందిన విజయలక్ష్మికి పురిటి నొప్పులు తీవ్రమవ్వడంతో బుధవారం జగిత్యాలలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. గురువారం విజయలక్ష్మికి డెలివరీ అవ్వగా ఆడబిడ్డకు జన్మినిచ్చింది. అయితే, బాలింతకు గర్భసంచీ తీసేయాలని, లేకుంటే తల్లి ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్లు చెప్పారని, అసలు సమస్య ఎంటో చెప్పలేదని బంధువులు తెలిపారు. తీరా సాయంత్రానికి వారు లోపలికి వెళ్లి చూడగా బాలింతకు జీవచ్ఛవంగా పడి ఉండటంతో మృతి చెందినట్లు గుర్తించామని బంధువులు […]

Update: 2021-05-06 11:58 GMT

దిశ, జగిత్యాల : జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలం కమ్మునూర్ గ్రామానికి చెందిన విజయలక్ష్మికి పురిటి నొప్పులు తీవ్రమవ్వడంతో బుధవారం జగిత్యాలలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. గురువారం విజయలక్ష్మికి డెలివరీ అవ్వగా ఆడబిడ్డకు జన్మినిచ్చింది. అయితే, బాలింతకు గర్భసంచీ తీసేయాలని, లేకుంటే తల్లి ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్లు చెప్పారని, అసలు సమస్య ఎంటో చెప్పలేదని బంధువులు తెలిపారు. తీరా సాయంత్రానికి వారు లోపలికి వెళ్లి చూడగా బాలింతకు జీవచ్ఛవంగా పడి ఉండటంతో మృతి చెందినట్లు గుర్తించామని బంధువులు వివరించారు. ఉదయం నుంచే తమకు అనుమానం రాగా, పలుమార్లు వైద్యులను బాలింత గురించి ప్రశ్నించగా మీరెందుకిలా అడ్డుపడుతున్నారంటూ తమపై బెదిరింపు ధోరణితో సిబ్బంది మాట్లాడారని మృతురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. విజయలక్ష్మికి ఏడాది కిందట మంచిర్యాల జిల్లా దండెపల్లి మండలం రెబ్బెనపల్లికి చెందిన బండ శరత్ కుమార్‌తో వివాహమైంది. బాధిత కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై శివకృష్ణ విచారణ చేపట్టారు. ఆస్పత్రి నిర్వాకం వల్లే బాలింత మృతి చెందినట్లు కుటుంబీకులు, బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు.

Tags:    

Similar News