ట్రాఫిక్ క్రేన్ కింద పడి మహిళ మృతి

దిశ, కంటోన్మెంట్: బైకు అదుపు తప్పి ట్రాఫిక్ క్రేన్ కిందకు దూసుకుపోయింది. ఈ ఘటనలో రక్షణశాఖ లో పనిచేస్తున్న ఓ మహిళ ఉద్యోగిని దుర్మరణం పాలైంది. ఈ ఘటన గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గాంధీ నగర్‌కు చెందిన మల్లయ్య, అన్నపూర్ణ దంపతులు పెద్ద కుమార్తె వేల్పుల సాయిలక్ష్మీ(33) రక్షణ శాఖలో ప్యాట్నీ సెంటర్ వద్ద ఉన్న కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ ఆకౌంట్స్‌లో అడిటర్ గా పనిచేస్తుంది. బుధవారం ఉదయం 9.30 […]

Update: 2020-08-19 12:15 GMT

దిశ, కంటోన్మెంట్: బైకు అదుపు తప్పి ట్రాఫిక్ క్రేన్ కిందకు దూసుకుపోయింది. ఈ ఘటనలో రక్షణశాఖ లో పనిచేస్తున్న ఓ మహిళ ఉద్యోగిని దుర్మరణం పాలైంది. ఈ ఘటన గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గాంధీ నగర్‌కు చెందిన మల్లయ్య, అన్నపూర్ణ దంపతులు పెద్ద కుమార్తె వేల్పుల సాయిలక్ష్మీ(33) రక్షణ శాఖలో ప్యాట్నీ సెంటర్ వద్ద ఉన్న కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ ఆకౌంట్స్‌లో అడిటర్ గా పనిచేస్తుంది. బుధవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో తెలిసిన వ్యక్తికి చెందిన యాక్టీవా వాహనంపై ఇంటి నుంచి కార్యాలయానికి బయలుదేరింది. సదరు వ్యక్తి వాహనం నడుపుతుండగా, సాయి లక్ష్మీ వెనుక కూర్చుంది.

కాగా మంగళవారం రాత్రి ఓ కారు నైవేధ్యం హోటల్ వద్ద డివైడర్‌ను ఢీకొట్టడంతో ఆగిపోయింది. దీంతో ట్రాఫిక్ జామ్ కావడంతో గోపాలపురం ట్రాఫిక్ పోలీసులు క్రేన్ సహాయంతో కారును తీసుకుని వస్తున్నారు. ఉదయం 10 గంటల సమయంలో వీరు ప్రయాణిస్తున్న బైకు చిలకలగూడ చౌరస్తాలోని ఓలిపెంటా బ్రిడ్జివద్దకు రాగా, వర్షం కురుస్తుండడంతో బైకు ఆదుపుతప్పి వెనుకాల కూర్చున్న సాయిలక్ష్మీ క్రేన్ వెనుక చక్రలా కింద పడింది. ఆమె తలపై క్రేన్ వెళ్లడంతో తల చిధ్రమై అక్కడికక్కడే మరణించింది. ప్రమాద ఘటన చూసి వాహనం నడుపుతున్న వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. మృతురాలి సోదరి సరస్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News