యాదాద్రిలో 24 కోట్ల విలువైన నిషేధిత డ్రగ్స్ పట్టివేత

యాదాద్రి భువనగిరి జిల్లాల్లో నిషేధిత ఎఫిడ్రిన్ డ్రగ్స్(Ephedrine drugs) పట్టుబడింది.

Update: 2024-11-26 12:13 GMT

దిశ, వెబ్ డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లాల్లో నిషేధిత ఎఫిడ్రిన్ డ్రగ్స్(Ephedrine drugs) పట్టుబడింది. యాదగిరిగుట్ట మండలంలో పెద్ద ఎత్తున తయారు చేసిన సింథటిక్ డ్రగ్స్‌(Synthetic drugs)ను హైదరాబాద్ వైపు తరలిస్తుండగా.. అత్యంత విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు భువనగిరి జోన్ పోలీసులు(Bhuvangiri Zone Police) బీబీనగర్ టోల్గేట్ వద్ద సదరు వాహనాన్ని చెక్ చేయగా.. ఇందులో 120 కిలోల ఎఫిడ్రిన్ అనే నిషేదిత డ్రగ్ పట్టుబడగా.. దానిని స్వాధీనం చేసుకున్నారు.

కాగా ఈ నిషేధిత డ్రగ్ విలువ మార్కెట్లో రూ. 24 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే ఈ నిషేధిత డ్రగ్ ను రామోజీ పేట లోని యాదాద్రి లైఫ్ సైన్సెస్ కంపెనీ(Yadadri Life Sciences Company)లో తయారు చేసారని.. నిందుతులు కృష్ణారెడ్డి, అహ్మద్, సునీల్ తమ అదుపులో ఉన్నారని పోలీసులు తెలిపారు. అలాగే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు.


Similar News