అంబేద్కర్ రాజ్యాంగంతోనే అణగారిన వర్గాలకు పదవులు : మంత్రి సీతక్క
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతోనే దేశంలోని అణగారిన వర్గాలకు రాజ్యాంగ పదవులు దక్కాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.
దిశ, మంగపేట : డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతోనే దేశంలోని అణగారిన వర్గాలకు రాజ్యాంగ పదవులు దక్కాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి సీతక్క మాట్లాడుతూ… డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆవిష్కరించిన అమలులోకి వచ్చిన నవంబర్ 26న మహానుభావుని విగ్రహావిష్కరణ తన చేతుల మీదుగా నేడు మంగపేటలో ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. వ్యయప్రయాసలకోర్చి అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన దాత, కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చెట్టుపల్లి వెంకటేశ్వర్లను మంత్రి సీతక్క అభినందించారు. ఎన్నో సంవత్సరాలుగా మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేయాలని పట్టుబట్టి తన స్వంత నిధులతో విగ్రహావిష్కరణ చేయడం అభినందనీయమన్నారు.
అత్యవసర పనుల ఉన్నప్పటికీ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు రావడం జరిగిందన్నారు. రాజ్యాంగ ఫలాలు పేద బడుగు, బలహీన వర్గాలకు దక్కేలా చేసిన అంబేద్కర్ విగ్రహాలను గ్రామ గ్రామాన ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. జిల్లా, మండల అంబేద్కర్ యువజన సంఘాల సహకారంతో నేడు అంగరంగ వైభవంగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసుకోవడం సంతోషానిచ్చిందని మంత్రి సీతక్క నిర్వాహకులను అభినందించారు. అనంతరం పలు గ్రామాల్లో చేపట్టిన రోడ్డు పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, మండల అధ్యక్షుడు మైల జయరాం రెడ్డి, సీనియర్ నాయకులు ఆక రాధాకృష్ణ, అంబేద్కర్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి బసారికారి హరికృష్ణ, పగిడిపల్లి వెంకటేశ్వర్లు, జిల్లా అధికార ప్రతినిధి అయ్యోరి యానయ్య, ముత్తినేని ఆదినారాయణ, చాద మల్లయ్య, భగవాన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, పూజరి సమ్మయ్య, కొంకతి సాంబశివరావు, మండల అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు, కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.