ఆ ప్రభుత్వ స్కూల్‌లో ఒకే ఒక్క విద్యార్థి.. ఏడాదికి రూ.12.84 లక్షల ఖర్చు

ప్రతి పౌరుడికి కనీస విద్యను అందించే లక్ష్యంతో ప్రభుత్వం కోట్లు ఖర్చుపెట్టి ప్రభుత్వ స్కూళ్లను నడిపిస్తుంది.

Update: 2024-11-26 15:16 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రతి పౌరుడికి కనీస విద్యను అందించే లక్ష్యంతో ప్రభుత్వం కోట్లు ఖర్చుపెట్టి ప్రభుత్వ స్కూళ్లను నడిపిస్తుంది. ఆర్థిక స్థోమత లేకపోయినప్పటికి చాలా మంది ప్రజలు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలకు పంపడానికి ఇష్ట పడుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అనేక గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస విద్యార్థులు లేకపోవడంతో పాఠశాలలను మూసివేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఓ ప్రభుత్వ పాఠశాలలో మాత్రం ఉన్న ఒకే ఒక్క విద్యార్థినికి చదువు చెప్పడానికి సంవత్సరానికి ఏకంగా 12.84 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆశ్చర్యకరమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలోనే చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా, నారపనేనిపల్లి ప్రభుత్వ పాఠశాలలో విచిత్ర పరిస్థితి నెలకొంది.

ఈ పాఠశాలలో కీర్తన అనే విద్యార్థిని.. 4వ తరగతి చదువుతుంది. కాగా ఈ స్కూల్‌లో కిర్తన ఒక్కతే చదువుతుండటంతో.. ఆమె కోసం ప్రభుత్వం ఒక టీచర్‌ను నియమించింది. ఆ టీచర్ కు నెలకు రూ.1,01,167 జీతం ఇస్తున్నారు. దీంతో 12 నెలలకు గాను రూ. 12.14 లక్షలు ఇవ్వనున్నారు. అలాగే పాఠశాలలో ఉన్న ఒకే ఒక్క విద్యార్థిని.. మధ్యాహ్న భోజనం నిమిత్తం వంట మనిషికి నెలకు రూ.3000 జీతం ఇస్తున్నారు. అలాగే పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికురాలు, స్కూల్ మెయింటైన్ గ్రాండ్, స్పోర్ట్స్ గ్రాండ్ ఇలా అన్ని ఖర్చులు కలిపి సుమారు సంవత్సరానికి.. రూ.12.84 లక్షల ఖర్చు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ వింద పరిస్థితికి సంబంధించిన సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఉన్న ఒకే ఒక్క విద్యార్థి కోసం ప్రభుత్వం పెడుతున్న ఖర్చుపై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి.


Similar News