మహారాష్ట్ర దేశీమద్యం పట్టివేత
నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో పక్కా సమాచారం మేరకు ఎక్సైజ్ శాఖ సిబ్బంది మంగళవారం రైడ్ నిర్వహించి మూడు బాక్సుల మహారాష్ట్ర దేశీ మద్యాన్ని పట్టుకున్నారు.
దిశ,భైంసా : నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో పక్కా సమాచారం మేరకు ఎక్సైజ్ శాఖ సిబ్బంది మంగళవారం రైడ్ నిర్వహించి మూడు బాక్సుల మహారాష్ట్ర దేశీ మద్యాన్ని పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎస్సై నిర్మల పాటిల్ మాట్లాడుతూ పట్టణంలోని కిసాన్ గల్లీలో గల ప్రభుత్వ బాలికల పాఠశాల వెనకాల గల పొదల్లో మహారాష్ట్ర దేశీదారు బాటిల్స్ ఉంచి గుట్టుగా వ్యాపారం కొనసాగిస్తురన్నారు. అయితే పక్కా సమాచారం మేరకు తమ ఎక్సైజ్ శాఖ సిబ్బందితో రైడ్ నిర్వహించినట్టు ఎస్సై తెలిపారు. నిందితుల కోసం ఆరా తీస్తున్నారు. ఈ రైడ్ లో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.