సర్వీస్ బుక్ లో సంతకం చేయడం లేదని ఆత్మహత్యాయత్నం

ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ సముదాయంలో ఓ ఉద్యోగి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలం రేపింది.

Update: 2024-11-26 11:55 GMT

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ సముదాయంలో ఓ ఉద్యోగి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలం రేపింది. ఆర్డీఓ కార్యాలయంలోని డీఏఓ తన సర్వీసు పుస్తకంలో సంతకం పెట్టడం లేదని విసుగు చెందిన సదరు ఉద్యోగి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అపస్మారక స్థితిలో ఉన్న ఆ ఉద్యోగిని కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది గమనించి అంబులెన్స్ లో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం..బాధితుడు అభిషేక్ నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో వీఆర్ఏ గా పనిచేసి ఇతర శాఖలో సర్దుబాటు అయ్యాడు.

    గతంలో నిర్మల్ జిల్లా ఖానాపూర్ తహసీల్దార్ గా పనిచేసిన నరేందర్ ప్రస్తుతం ఆదిలాబాద్ ఆర్డీఓ ఆఫీసు డీఏఓగా బదిలీ కావడంతో సదరు ఉద్యోగి తన సర్వీస్ పుస్తకం తీసుకుని సంతకం కోసం ఇక్కడి వచ్చాడు. దాంతో సంతకం పెట్టకుండా ఇబ్బంది పెట్టడంతో పురుగుల మందు తాగాడు. అది గమనించిన సిబ్బంది ఆయన్ని రిమ్స్ ఆదిలాబాద్ కు తరలించగా వైద్యులు చికిత్సను అందించారు. అనంతరం ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


Similar News