వరద నీటిలో పడి మహిళ మృతి
దిశ, నాగార్జున సాగర్: వరద ప్రవాహంలో పడి ఓ మహిళ మరణించింది. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు ,కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం…. నిడమనూరుకు చెందిన తెందోటి లక్ష్మీ స్థానిక మోడల్ స్కూల్ లో ఆయాగా పనిచేస్తోంది. దసరా పండుగ సమీపిస్తుండటంతో తన ఇద్దరు కూతుళ్లు, భర్త నర్సింహతో కలిసి హాలియాకు మంగళవారం వెళ్లింది. సాయంత్రం షాపింగ్ ముగించుకుని వారు నిడమనూరుకు తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో నిడమనూరు వచ్చేందుకు […]
దిశ, నాగార్జున సాగర్:
వరద ప్రవాహంలో పడి ఓ మహిళ మరణించింది. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు ,కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం…. నిడమనూరుకు చెందిన తెందోటి లక్ష్మీ స్థానిక మోడల్ స్కూల్ లో ఆయాగా పనిచేస్తోంది. దసరా పండుగ సమీపిస్తుండటంతో తన ఇద్దరు కూతుళ్లు, భర్త నర్సింహతో కలిసి హాలియాకు మంగళవారం వెళ్లింది. సాయంత్రం షాపింగ్ ముగించుకుని వారు నిడమనూరుకు తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో నిడమనూరు వచ్చేందుకు సరైన దారిలేకపోవడంతో బంకాపురం మీదుగా రావల్సి వచ్చింది. కాగా నిడమనూరు శివారులో ఉన్న లోలెవల్ కాజ్ వే పై నుంచి వరద నీరు ఉద్రృతంగా వస్తోంది. దీంతో ముందుగా తన ఇద్దరు కూతుళ్లను తీసుకుని కాజ్ వే దాటించి ఇంటి వద్ద దింపి వద్దామని నర్సింహ వెళ్లారు. భర్త తిరిగి వచ్చేలోగా కాజ్ వే దాటుదామని లక్ష్మీ ప్రయత్నిచింది. దీంతో ప్రమాదవశాత్తు కాలుజారీ కాజ్ వే లోపల గూనల్లో పడిపోయింది. అక్కడ ఉన్న వారు ఇది గమనించి కేకలు వేశారు. కాగా పిల్లలను ఇంట్లో దింపి అక్కడికి వచ్చిన నరసింహ ఈ విషయం గుర్తించాడు. తాళ్ల సహాయంతో ఆమె బయటకు తీసి స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా ఆమె అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.