భయం భయం.. కర్నూలులో 10 రోజుల్లో 18 మంది మృతి!

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు తీవ్రత రోజురోజుకూ ఉధృతంగా మారుతోంది. గతంలో పది వేలకు పైగా కేసులు వెలుగుచూడగా, సెకండ్ వేవ్‌లో 20 వేలకు పైగా కొత్త కేసులు రోజువారీగా నమోదవు తున్నాయి. దీనికి తోడు ప్రతీరోజు మరణాలు కూడా హాఫ్ సెంచరీ దాటుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కర్నూలు జిల్లా పగిడ్యాల మండలం నెహ్రూనగర్‌లో తీవ్ర విషాదం నెలకొంది. కేవలం 10 రోజుల్లో 18 మంది మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. మృతులంతా […]

Update: 2021-05-07 06:03 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు తీవ్రత రోజురోజుకూ ఉధృతంగా మారుతోంది. గతంలో పది వేలకు పైగా కేసులు వెలుగుచూడగా, సెకండ్ వేవ్‌లో 20 వేలకు పైగా కొత్త కేసులు రోజువారీగా నమోదవు తున్నాయి. దీనికి తోడు ప్రతీరోజు మరణాలు కూడా హాఫ్ సెంచరీ దాటుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కర్నూలు జిల్లా పగిడ్యాల మండలం నెహ్రూనగర్‌లో తీవ్ర విషాదం నెలకొంది. కేవలం 10 రోజుల్లో 18 మంది మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది.

మృతులంతా వాంతులు, వీరేచనాలు, గుండెపోటు వంటి లక్షణాలతో మరణించినట్లు సమాచారం. ఈ మరణాలకు కరోనా కారణమా, కలుషిత నీరు కారణమా అనే అనుమానాలు కలుగుతున్నాయి. వరుస మరణాలకు గల కారణాలంటే తేల్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రతిఒక్కరూ కరోనా టెస్టు చేయించుకోవాలని సర్పంచ్ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు.

Tags:    

Similar News