Ap News: వైసీపీ నేత అరాచకం.. ఆస్పత్రి పాలైన యువతి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో దారుణం జరిగింది..

దిశ, వెబ్ డెస్క్: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ(Nandyala District Allagadda)లో దారుణం జరిగింది. యువతిపై వైసీపీ కౌన్సిలర్ చక్రపాణి(YCP councilor Chakrapani) అరాచకానికి దిగారు. ఓ యువతిపై కౌన్సిలర్ చక్రపాణి అల్లుడు భాస్కర్ అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. దీంతో యువతి ప్రతిఘటించి భాస్కర్‌ను చెంపదెబ్బ కొట్టారు. తనను కొట్టిన విషయాన్ని మామ కౌన్సిలర్‌కు భాస్కర్ చెప్పారు. దీంతో యువతి కుటుంబంపై కత్తులతో కౌన్సిలర్ చక్రపాణి దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితులను నంద్యాల ఆసుపత్రికి తరలించారు. అయితే కౌన్సిలర్ చక్రపాణి దాడి చేసిన దృశ్యాలు స్థానిక సీసీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.