మహానంది క్షేత్రంలో చిరుత మళ్లీ కలకలం
నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో మళ్లీ చిరుత కలకలం రేపింది...
దిశ, వెబ్ డెస్క్: నంద్యాల జిల్లా మహానంది క్షేత్రం(Mahanandi Kshetram)లో మళ్లీ చిరుత(Cheetah) కలకలం రేపింది. మహానంది, గాజులపల్లి సమీపంలో చిరుతను యాత్రికులు చూశారు. వెంటనే మహానంది పోలీసులకు సమాచారం అందించారు. చిరుత వరస కదలికలతో యాత్రికులు, స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అయితే అటవీశాఖకు సమాచారం అందించామని, అప్పటి వరకూ యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. అటవీశాఖ అధికారులు బోను ఏర్పాటు చేసే వరకూ స్థానికులు, యాత్రికులు ఒంటరిగా తిరగొద్దన్నారు. ఒక వేళ వెళ్లాల్సి వస్తే శబ్దాలు చేసుకుంటూ పోవాలని పోలీసులు తెలిపారు.