Tamoto Prices : కిలో రూ.1 కి పడిపోయిన టమాటా ధరలు
తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధరలు(Tamoto Prices) భారీగా పడిపోయాయి.
దిశ, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధరలు(Tamoto Prices) భారీగా పడిపోయాయి. కర్నూలు(Karnool) జిల్లాలో టమాటా రైతులకు కన్నీళ్ళు మిగిలాయి. నిన్నా మొన్నటి వరకు కిలో 100 రూపాయలు పలికిన టమాట ధరలు నేడు ఒక్కసారిగా రూ.1 కి పడిపోయాయి. సోమవారం కర్నూల్ జిల్లాలోని పత్తకొండ మార్కెట్‌లో కిలో టమాటా రూ.1 మాత్రమే పలకడంతో.. పంట తీసుకువచ్చిన రైతులు కంటతడి పెట్టారు. కనీసం రవాణా ఛార్జీలు కూడా రాకపోవడమే కాదు.. తెచ్చిన పంటను కొనడానికి కూడా ఎవరూ ముందుకు రాకపోవడంతో.. రైతులు వాటిని రోడ్డు పక్కన పారబోసి వెళ్లారు. అయితే పలు ప్రాంతాల నుంచి భారీగా టమాటా వస్తుండటంతో.. స్థానిక రైతుల వద్ద కొనేవారు ఎవరూ లేకుండా పోయారు.