అమరావతికి గుడ్ న్యూస్.. రూ.15 వేల కోట్ల రుణాలకు క్లియరెన్స్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ తెలిపింది...

Update: 2024-12-12 10:25 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజధాని అమరావతి(Amaravati)కి గుడ్ న్యూస్ తెలిపింది. ఆసియా అభివృద్ధి బ్యాంక్(Asian Development Bank) రూ.15000 కోట్లు రుణాలు మంజూరు చేస్తూ క్లియరెన్స్ ఇచ్చింది. అమరావతి అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. రాజధానికి నిధులు సమకూర్చుకునేందుకు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ఈ మేరకు వివిధ బ్యాంకుల నుంచి రూ. 15 వేల కోట్లు ఇప్పించేందుకు కేంద్రబడ్జెట్‌లో ఆమోదం తెలిపింది. దీంతో రాజధానిని అభివృద్ధి చేసేందుకు పలు బ్యాంకులతో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి చర్చలు జరిపింది. ఈ చర్చల్లో ఆసియా అభివృద్ధి బ్యాంక్ ముందుకు వచ్చింది. ఈ మేరకు ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి రుణాలు మంజూరు చేస్తూ క్లియరెన్స్ ఇచ్చింది. 


Similar News