Central Cabinet Meeting: కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం.. జమిలి ఎన్నికల బిల్లుకు ఆమోదం
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో సంచలనం నిర్ణయం తీసుకున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో సంచలనం నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ (One Nation.. One Election) డ్రాఫ్ట్ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇప్పటికే జమిలీ ఎన్నికల (Jamili Elections)పై రామ్‌నాథ్ కోవింగ్ కమిటీ సిఫార్సులకు ఆమోదం తెలిపిన కేంద్రం.. తాజాగా జమిలి ఎన్నికల బిల్లుకు కేబినెట్‌లో ఆమోద ముద్ర వేశారు. మార్చి 14న మొత్తం 18,629 పేజీలతో జమిలీ ఎన్నికలపై రామ్‌నాథ్ కోవింద్ కమిటీ రాష్ట్రపతికి నివేదికను అందజేసింది.
తొలి దశలో లోక్‌సభ, అసెంబ్లీలకు జమిలి ఎన్నికల నిర్వహణకు సిఫారసు చేసింది. రెండో దశలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని రిపోర్ట్ ఇచ్చింది. అదేవిధంగా జమిలి ఎన్నికల కోసం దేశ వ్యాప్తంగా ఒకే ఓటరు జాబితా తయారీకి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ప్రతిపాదనలు చేసింది. అయితే, ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ ముసాయిదా బిల్లును కేంద్ర న్యాయ శాఖ (Central Department of Justice) రూపొందించింది. మరోవైపు జమిలి ఎన్నికలకు దాదాపు 32 రాజకీయ పార్టీలు అంగీకారం తెలుపగా.. మరో 13 పార్టీలు వ్యతిరేకించాయి. కాగా, జమిలి ఎన్నికల బిల్లును ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. 2027లో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్‌సభకు కూడా ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
కాగా, దేశానికి స్వాతంత్రం లభించాక 1952లో తొలి సాధారణ ఎన్నికల నుంచి 1967 వరకు లోక్‌సభ (Lok Sabha)కు, అన్ని రాష్ట్రా అసెంబ్లీ (Assembly)లకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అనంతరం దేశంలో బలమైన ప్రభుత్వాలు ఏర్పడకపోవడం, గడువుకు ముందే పలు రాష్ట్రాల అసెంబ్లీలు రద్దు అవడంతో రానా రాను జమిలి ఎన్నికలు పట్టాలు తప్పాయి. దీంతో లోక్‌సభ, అసెంబ్లీలకు వేరువేరుగా ఎన్నికలు నిర్వహిస్తూ వస్తున్నారు. జమిలి ఎన్నికలు (Jamili Elections) జరగాలంటే దాదాపు 18 రాజ్యాంగ సవరణలు, ప్రజా ప్రాతినిధ్య చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని రామ్‌నాథ్ కోవింద్ కమిటీ (Ramnath Kovind Committe) నరేంద్ర మోడీ (Narendra Modi) ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ముఖ్యంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 356, ఆర్టికల్ 324, ఆర్టికల్ 83(2), ఆర్టికల్ 172(1), ఆర్టికల్ 83కు సంబంధించి పలు సవరణలు చేయాల్సి అవసరం ఉందని పొలికల్ అనలిస్ట్‌లు చెబుతున్నారు.