Supreme Court : పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు ఈడీ పాఠాలు అక్కర్లేదు : సుప్రీంకోర్టు
దిశ, నేషనల్ బ్యూరో : పబ్లిక్ ప్రాసిక్యూటర్ల(పీపీ)తో వ్యవహార శైలి విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు సుప్రీంకోర్టు(Supreme Court) హితబోధ చేసింది.
దిశ, నేషనల్ బ్యూరో : పబ్లిక్ ప్రాసిక్యూటర్ల(పీపీ)తో వ్యవహార శైలి విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు సుప్రీంకోర్టు(Supreme Court) హితబోధ చేసింది. కోర్టులో ఏమేం చేయాలనే దానిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు ఈడీ కానీ, ఈడీ(Enforcement Directorate) డైరెక్టర్ కానీ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. మనీలాండరింగ్ అభియోగాలన్నీ ఈడీ విచారణ పరిధిలోకి వస్తాయి. మనీలాండరింగ్ కేసులపై కోర్టుల్లో ఎలా వాదనలు వినిపించాలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ల(public prosecutors)కు ఈడీ నేర్పాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఓకా, అగస్టీన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
పీపీలు స్వేచ్ఛగా పనిచేసే పరిస్థితులు ఉండాలని, వారిని ప్రభావితం చేసేందుకు ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలు ప్రయత్నించరాదని తేల్చి చెప్పింది. ఢిల్లీ వక్ఫ్ బోర్డు మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసిన జీషాన్ హైదర్, దావూద్ నాసిర్‌లను బెయిల్ మంజూరు చేసే క్రమంలో సుప్రీంకోర్టు బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది.