AP News:మంత్రి కొల్లు రవీంద్ర సోదరుని మృతికి మాజీ మంత్రి సంతాపం
రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) ఇంట విషాదం చోటు చేసుకుంది.
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) ఇంట విషాదం చోటు చేసుకుంది. మంత్రి సోదరుడు కొల్లు వెంకటరమణ(64)కు బుధవారం రాత్రి గుండెపోటు(heart attack) రావడంతో మృతి చెందారు. ఆయన మృతి పట్ల టీడీపీ(TDP) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు(Former Minister Devineni Umamaheswara Rao)సంతాపం తెలిపారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని వారి స్వగృహమునందు నేడు(గురువారం) టీడీపీ నేతలు కొనకళ్ళ నారాయణరావు, యెనిగండ్ల రాము, కాగిత కృష్ణ ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, కొనకళ్ళ బుల్లయ్య, మాటమర్రి బాబా ప్రసాద్, దాసు మరియు ఇతర నేతలతో కలిసి రమణ భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాగా కొల్లు వెంకటరమణ వ్యాపారవేత్త. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.