కాలుతున్న కారడవి

సిమ్లా: ఈ ఏడాది ఇంకా పూర్తి స్థాయిలతో వేసవి ప్రారంభం కాకముందే హిమాలయ సానువుల్లోని ఉత్తరాఖండ్‌ అడవుల్లో కార్చిచ్చు ప్రబలుతున్నది. మంటలు వేగంగా విస్తరిస్తుండటంతో అక్కడి అడవిలో దావానలం చెలరేగుతున్నది. ఇప్పటివరకు 65 హెక్టార్లలో అడవి కాలి బూడిదైనట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ఘటనలో నలుగురు పౌరులు మరణించారు. వీరిలో ఇద్దరు మహిళలున్నారు. అల్మోరా జిల్లాలోని ఈ ఇద్దరు మహిళలు పశువులకు దాణా కోసం వెళ్లి మంటల్లో చిక్కుకుని ఆహుతయ్యారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి 12వేల […]

Update: 2021-04-04 11:28 GMT

సిమ్లా: ఈ ఏడాది ఇంకా పూర్తి స్థాయిలతో వేసవి ప్రారంభం కాకముందే హిమాలయ సానువుల్లోని ఉత్తరాఖండ్‌ అడవుల్లో కార్చిచ్చు ప్రబలుతున్నది. మంటలు వేగంగా విస్తరిస్తుండటంతో అక్కడి అడవిలో దావానలం చెలరేగుతున్నది. ఇప్పటివరకు 65 హెక్టార్లలో అడవి కాలి బూడిదైనట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ఘటనలో నలుగురు పౌరులు మరణించారు. వీరిలో ఇద్దరు మహిళలున్నారు. అల్మోరా జిల్లాలోని ఈ ఇద్దరు మహిళలు పశువులకు దాణా కోసం వెళ్లి మంటల్లో చిక్కుకుని ఆహుతయ్యారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి 12వేల గార్డులు, ఫైర్ వాచర్స్‌ను అటవీ ప్రాంతాల్లో మోహరించామని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ (ఫైర్) వివరించారు.

ఇప్పటి వరకు రూ. 37 లక్షల ఆస్తి నష్టం సంభవించిందని ఆయన తెలిపారు. ఈ పరిస్థితిపై రాష్ట్ర ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి కేంద్రం సాయం కోరారు. మరోవైపు, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపుతూ కేంద్రం ఆదేశాలిచ్చింది.

Tags:    

Similar News