రాత్రికి రాత్రే అడవి పందుల దాడి.. ఆందోళనలో రైతు
దిశ, బెజ్జూర్ : ఆరుగాలం కష్టించి పంట పండించిన రైతులకు ఏదో ఒకవిధంగా నష్టాలు తప్పడం లేదు. ఓ వైపు ప్రకృతి ప్రకోపంతో నష్టాలు వస్తుండగా.. మరోవైపు అడవి జంతువులతోనూ తీవ్ర నష్టం జరుగుతోంది. శుక్రవారం అర్ధరాత్రి బెజ్జూర్ మండలంలోని ఏటిగుడా గ్రామానికి చెందిన పంబాల సన్యాసి అనే రైతు పొలాన్ని అడవి పందులు ధ్వంసం చేశాయి. బెజ్జూర్ శివారులోని రెండు ఎకరాల్లో వరి పంట వేయగా అడవిపందులు వరి పంటను ధ్వంసం చేశాయి. పంట చేతికొచ్చే […]
దిశ, బెజ్జూర్ : ఆరుగాలం కష్టించి పంట పండించిన రైతులకు ఏదో ఒకవిధంగా నష్టాలు తప్పడం లేదు. ఓ వైపు ప్రకృతి ప్రకోపంతో నష్టాలు వస్తుండగా.. మరోవైపు అడవి జంతువులతోనూ తీవ్ర నష్టం జరుగుతోంది. శుక్రవారం అర్ధరాత్రి బెజ్జూర్ మండలంలోని ఏటిగుడా గ్రామానికి చెందిన పంబాల సన్యాసి అనే రైతు పొలాన్ని అడవి పందులు ధ్వంసం చేశాయి.
బెజ్జూర్ శివారులోని రెండు ఎకరాల్లో వరి పంట వేయగా అడవిపందులు వరి పంటను ధ్వంసం చేశాయి. పంట చేతికొచ్చే దశలో అడవి పందులు ధ్వంసం చేయడంతో రైతుకు తీవ్ర నష్టం జరిగింది. అటవీ అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి పరిహారం అందించాలని బాధితుడు కోరారు.