గిరిజన యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన యువతీ, యువకులకు సీతారాం స్పిన్నర్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు ఐటీడీపీఓ కుష్బూ గుప్త తెలిపారు.
దిశ, ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన యువతీ, యువకులకు సీతారాం స్పిన్నర్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు ఐటీడీపీఓ కుష్బూ గుప్త తెలిపారు. టెక్నీషియన్, అసిస్టెంట్, మిషన్ ఆపరేటర్స్ కోసం ఫ్రెషర్లను నియమిస్తున్నారని, ఈ అవకాశాన్ని ఉమ్మడి జిల్లాలోని గిరిజన యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సీతారాం స్పిన్నర్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఉద్యోగ ఖాళీలు 300 ఉన్నాయని తెలిపారు. సాంకేతిక నిపుణులు..1, మెషిన్ ఆపరేటర్లు 2, సహాయకులు 3 ఉన్నాయని, విద్యార్హత 7వ తరగతి నుంచి డిగ్రీ చదువుకున్న వారు అర్హులని, వయస్సు 18 సం. నుండి 38 సం. ఉండాలని తెలిపారు.
వేతనం నెలకు రూ.10 వేల నుంచి 17 వేలతో పాటు ఈఎస్ఐ & పీ ఫ్ సౌకర్యం ఉంటుందని తెలిపారు. ఎంపికైన అభ్యర్ధులకు భోజనం కోసం సబ్సిడీ క్యాంటీన్, ఉచిత వసతి (రూమ్), గ్రూప్ యాక్సిడెంటల్ ఫాలసీ కల్పించనున్నట్టు చెప్పారు. క్యాంపస్ ఆవరణలో ఆసుపత్రి సదుపాయం ఉంటుందని, కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగుల పిల్లలకి ఉచిత పే స్కూల్ ఉంటుందని పేర్కొన్నారు. సూపర్ మార్కెట్, ఏటీఎం సదుపాయం కలదన్నారు. ఎంపిక అయిన అభ్యర్థుల్లో భార్యా, భర్త ఇద్దరూ ఉంటే వారికి వేరే రూమ్ సదుపాయం కల్పిస్తారని, ఆసక్తి గల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన నిరుద్యోగ యువతీ, యువకులు తమ సర్టిఫికెట్స్ లతో ఈనెల 28 శనివారం ఉదయం 10 గంటలకు స్థానిక కొమురం భీం ప్రాంగణంలోని యువజన శిక్షణ కేంద్రం ఉట్నూర్ లో జరిగే ఇంటర్వ్యూ లకు హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాల కోసం 9666748105, 9493535052.సంప్రదించాలన్నారు.