సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలి

ఆదివాసీ గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవని, భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు.

Update: 2024-12-23 11:37 GMT

దిశ, ఉట్నూర్ : ఆదివాసీ గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవని, భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. సోమవారం ఉట్నూర్ మండల కేంద్రంలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆదివాసీలు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారితో సమావేశమై పలు విషయాలపై చర్చించారు.

    అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తరతరాలుగా ఆదివాసీలు ప్రకృతినే దైవంగా భావించి పూజలు చేయడం ఆనవాయితీని పేర్కొన్నారు. దేశంలో ఉన్న ఆదివాసీలు నిత్యం ఇతర రాష్ట్రాల ఆదివాసీలతో కలుస్తూ ఉండాలని సూచించారు. అన్ని రాష్ట్రల ఆదివాసీలు ఐక్యంగా ఉండాలని, గోండి ధర్మ రక్షణకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కుమ్రం భీం మనువడు కుమ్రం సోనేరావ్, జిల్లా రాయిసెంటర్ సార్మేడి దుర్గు పటేల్, రాజ్ గోండు సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు మంగం విషంరావ్, ఆదివాసీ పెద్దలు పాల్గొన్నారు.


Similar News