మానిక్ గూడలో చిరుతపులి కదలికలు

ఆసిఫాబాద్ మండలంలోని మానిక్ గూడ శివారులో చిరుత పులి సంచారం కలవరం రేపుతోంది.

Update: 2024-12-23 09:34 GMT

దిశ, ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ మండలంలోని మానిక్ గూడ శివారులో చిరుత పులి సంచారం కలవరం రేపుతోంది. సోమవారం పంటపొలాల్లో స్థానిక రైతులు చిరుత పులి అడుగులను గమనించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా వారు పాదముద్రలు పరిశీలించి ఆది చిరుత పులి అని అటవీ శాఖ అధికారులు నిర్థారించారు. చిరుతపులి అడుగు జాడలను బట్టి అది వెళ్తున్న ప్రాంతాన్ని అధికారులు ట్రాకింగ్ చేస్తున్నారు.

     పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యవసాయ పనులకు వెళ్లే సమయంలో ఒంటరిగా వెళ్లొద్దని సూచించారు. కాగా వారం రోజుల క్రితం సైతం ఇదే చిరుతపులి మానిక్ గూడ శివారులోని నీటి గుంతలో నీరు తాగి వెళ్తున్న క్రమంలో పలువురు గ్రామస్తులు చూశారు. మళ్లీచిరుత పులి సంచారం ఉందని తెలియడంతో ఆ ప్రాంతం ప్రజలు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు. 


Similar News