అట్టహాసంగా సింగరేణి డే వేడుకలు ప్రారంభం..
గోలేటి శ్రీ భీమన్న స్టేడియంలో సోమవారం సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
దిశ, తాండూర్ : గోలేటి శ్రీ భీమన్న స్టేడియంలో సోమవారం సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా బెల్లంపల్లి ఏరియా జీఎం శ్రీనివాస్ సింగరేణి పథకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం సింగరేణి తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి బెలూన్ గాలిలోకి వదిలారు. సింగరేణి డే సందర్భంగా స్టేడియంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను జీఎం, అతిధులు ప్రారంభించారు.
అంతకు ముందు గోలేటి సింగరేణి హై స్కూల్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు జీఎం శ్రీనివాస్ కు, అతిథులకు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమం సింగరేణి సేవా సమితి ఏరియా అధ్యక్షురాలు ఉమారాణి, ఎస్ఓటూ జీఎం రాజమల్లు, ఏరియా ఇంజనీర్ భీంరావు జాడే, ప్రాజెక్టు అధికారి నరేందర్, సివిల్ ఎస్ఈ భాషా, ప్రాజెక్టు ఇంజనీర్ వీరన్న, పర్సనల్ మేనేజర్ తిరుపతి రెడ్డి, ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ ఉమాకాంత్, సీనియర్ పర్సనల్ అధికారి ప్రశాంత్, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ తిరుపతి, ఉపాధ్యక్షుడు బయ్య మొగిలి, ఐఎన్టీయూసీ, టీబీజీకేఎస్ ఏరియా నాయకులు పేరం శ్రీనివాస్, ఎం.శ్రీనివాసరావు, వివిధ విభాగాల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.