పెంచికలపేట రేంజ్ లో పులి

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట మండలంలో బొంబాయి గూడ, ఎర్రగుంట, పోతేపల్లి, కొండపల్లి గ్రామాల్లో పులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.

Update: 2024-12-23 11:51 GMT

దిశ, బెజ్జూర్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట మండలంలో బొంబాయి గూడ, ఎర్రగుంట, పోతేపల్లి, కొండపల్లి గ్రామాల్లో పులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రజలు అడవుల్లోకి వెళ్లరాదని, ఒంటరిగా వ్యవసాయ పనులు చేసుకోరాదని సోమవారం పెంచికలపేట అధికారులు కోరారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటల తర్వాత వ్యవసాయ పనులకు వెళ్లి సాయంత్రం నాలుగు గంటల వరకు ముగించుకొని ఇంటికి తిరిగి రావాలని పిలుపునిచ్చారు. పులి ఎక్కడైనా కనిపిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. పులికి హాని కలిగిస్తే కఠిన చర్య తీసుకుంటామని హెచ్చరించారు. 


Similar News