ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు ఇంగ్లిష్ పై పట్టు సాధించాలి
ప్రభుత్వ బడుల్లో చదువుకునే విద్యార్థులు ఇంగ్లిష్ పై పట్టు సాధించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
దిశ, ఆదిలాబాద్ : ప్రభుత్వ బడుల్లో చదువుకునే విద్యార్థులు ఇంగ్లిష్ పై పట్టు సాధించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సోమవారం జిల్లాలోని 42 ప్రభుత్వ పాఠశాలలు, ప్రైమరీ, యూపీఎస్ హెడ్మాస్టర్లు, టీచర్లు (రిసోర్స్ పర్సన్స్)తో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 42 ప్రభుత్వ పాఠశాలల టీచర్లకు ఇంగ్లిష్ పై శిక్షణ ఇవ్వాలని, అందుకు యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని డీఈఓ ప్రణీతను ఆదేశించారు.
పాఠశాలల టీచర్లకు ఇంగ్లిష్, సోషల్, మ్యాథ్స్, ఏవీఎస్ స్పోకెన్ ఇంగ్లిష్ 1 నుంచి 5 సబ్జెక్టుల వారీగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. 1వ, 2వ క్లాస్ విద్యార్ధులకు ఇంగ్లిష్ లో చదవడం, రాయడంపై టీచర్లు ఇంగ్లీష్ సబ్జెక్ట్ పై పట్టు సాధించి, ఇంగ్లిష్ ధారాళంగా మాట్లాడే విధంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఈ శిక్షణ కార్యక్రమం సంక్రాంతి పండుగ తర్వాత నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో సెక్టోరల్ అధికారులు శ్రీకాంత్, సుజిత్ ఖాన్, అజయ్, తదితరులు పాల్గొన్నారు.