వైట్ ఫంగస్ టెన్షన్.. మరో వ్యక్తిలో లక్షణాలు..

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో వైట్ ఫంగస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మధ్యప్రదేశ్​జబల్‌పూర్‌లో వైట్ ఫంగస్ కేసు నమోదు అయింది. ఓ వ్యక్తికి ఈ వ్యాధి నిర్ధారణ అయినట్టు జబల్‌పూర్ మెడికల్ కాలేజీ ఈఎన్‌టీ హెడ్ డాక్టర్ కవితా సచ్​దేవా తెలిపారు. జబల్‌పూర్ మెడికల్ కాలేజీలో 55 ఏళ్ల వ్యక్తి ఇన్‌ఫెక్షన్‌తో ఆస్పత్రిలో చేరగా.. ఆయనకు పరీక్షల్లో వైట్ ఫంగస్ ఉన్నట్లు తేలిందని వెల్లడించారు. అయితే.. బ్లాక్ ఫంగస్ మాదిరిగా వైట్ ఫంగస్.. అంత […]

Update: 2021-05-22 02:53 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో వైట్ ఫంగస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మధ్యప్రదేశ్​జబల్‌పూర్‌లో వైట్ ఫంగస్ కేసు నమోదు అయింది. ఓ వ్యక్తికి ఈ వ్యాధి నిర్ధారణ అయినట్టు జబల్‌పూర్ మెడికల్ కాలేజీ ఈఎన్‌టీ హెడ్ డాక్టర్ కవితా సచ్​దేవా తెలిపారు. జబల్‌పూర్ మెడికల్ కాలేజీలో 55 ఏళ్ల వ్యక్తి ఇన్‌ఫెక్షన్‌తో ఆస్పత్రిలో చేరగా.. ఆయనకు పరీక్షల్లో వైట్ ఫంగస్ ఉన్నట్లు తేలిందని వెల్లడించారు. అయితే.. బ్లాక్ ఫంగస్ మాదిరిగా వైట్ ఫంగస్.. అంత ప్రమాదకరమేమీ కాదని చెప్పారు. సాధారణ ఔషధాలతోనే దీన్ని తగ్గించవచ్చని తెలిపారు. ఇప్పటికే దేశంలో గుజరాత్, బీహార్, హర్యానాలోనూ వైట్ ఫంగస్ కేసులు నమోదు అయ్యాయి.

 

Tags:    

Similar News