అక్కడ రెండు బస్సులు ఎదురొస్తే చీమ కూడా దూరదేమో..!
దిశ, బీర్పూర్: బీర్పూర్ మండల కేంద్రం ఏర్పడి ఆరు సంవత్సరాలు కావొస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది. మండల కేంద్రంలోని ప్రధాన రహదారి మొత్తం గుంతలమయం అయింది. ప్రజలు నడవడానికి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. రెండు బస్సులు ఎదురెదురుగా వచ్చినప్పుడు రోడ్డు ఇరుకుగా ఉండడం వల్ల చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. గ్రామస్తులు, గ్రామ యువత నాయకులకు, అధికారులకు ఎన్నో సార్లు మొరపెట్టుకున్నారు. అయినా సమస్య పరిష్కారం కాలేదని వాపోతున్నారు. కనీసం ఇప్పటికైనా నాయకులు, అధికారులు […]
దిశ, బీర్పూర్: బీర్పూర్ మండల కేంద్రం ఏర్పడి ఆరు సంవత్సరాలు కావొస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది. మండల కేంద్రంలోని ప్రధాన రహదారి మొత్తం గుంతలమయం అయింది. ప్రజలు నడవడానికి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. రెండు బస్సులు ఎదురెదురుగా వచ్చినప్పుడు రోడ్డు ఇరుకుగా ఉండడం వల్ల చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. గ్రామస్తులు, గ్రామ యువత నాయకులకు, అధికారులకు ఎన్నో సార్లు మొరపెట్టుకున్నారు. అయినా సమస్య పరిష్కారం కాలేదని వాపోతున్నారు. కనీసం ఇప్పటికైనా నాయకులు, అధికారులు తక్షణం చొరవ తీసుకుని సమస్య పరిష్కారం చేయగలరని కోరుతున్నారు.